నేరేడ్‌మెట్ కౌంటింగ్‌పై తీర్పు ఇచ్చిన హైకోర్టు..!

Monday, December 7th, 2020, 05:41:27 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి నేరేడ్‌మెట్ డివిజిన్‌ కౌంటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4వ తేదిన కౌంటింగ్‌కు కొన్ని గంటల ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సర్క్యులర్ జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం బ్యాలెట్ పత్రాల మీద స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతరత్రా గుర్తులు ఉన్నా కూడా వాటిని గుర్తించాలంటూ ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.

అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్క్యులర్‌ను సస్పెండ్ చేసింది. అయితే ఎన్నికలకు సంబంధించిన అంశంలో కోర్టుల జోక్యం తగదని ఎస్ఈసీ మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్వస్తిక్ గుర్తులతో పాటు ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లను కూడా లెక్కించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నేరెడ్‌మెట్‌ డివిజన్‌‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి 504 ఓట్ల మెజారిటీ ఉంది. ఇతర ముద్రలతో ఉన్న 544 ఓట్లు లెక్కిస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.