బిగ్ న్యూస్: మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి లకు హైకోర్ట్ నోటీసులు

Tuesday, March 23rd, 2021, 02:07:39 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మంత్రులు అయిన బొత్స సత్యనారాయణ మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లకు ఉన్నత న్యాయస్థానం నోటీసులను జారీ చేసింది. అయితే గవర్నర్ తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీకేజీ అవ్వడం పట్ల సీబీఐ విచారణ జరిపించాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్ట్ ను ఆశ్రయించారు. అయితే నేడు కోర్ట్ లో విచారణ జరిగింది. అయితే ప్రివిలేజ్ లెటర్స్ లీక్ అవ్వలేదు అని, గవర్నర్ సెక్యూరిటీ చెప్పారు అంటూ ఎన్నికల కమిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఇందుకు సంబంధించిన తదుపరి విచారణ ను వచ్చే మంగళవారము కి వాయిదా వేయడం జరిగింది. ఈ వ్యవహారం లో ఉన్నత న్యాయస్థానం మంత్రులు బొత్స సత్యనారాయణ మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లకు నోటీసులు జారీ చేయడం జరిగింది.