మంత్రి పెద్దిరెడ్డి కి హైకోర్టు లో ఊరట…కానీ!

Wednesday, February 10th, 2021, 02:22:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ను ఇంటికే పరిమితం చేయాలి అని, మీడియా తో మాట్లాడకూడదు అంటూ డీజీపీ కి ఆదేశాలు చేరి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల సవాల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జ్ ధర్మాసనం పెద్దిరెడ్డి ను ఇంటికే పరిమితం చేయాలి అనే ఆదేశాలను రద్దు చేసింది, మీడియా తో మాట్లాడకుండా చూడాలని ఉన్న ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేశారు.

సింగిల్ జడ్జ్ ధర్మాసనం తీసుకున్న నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం మీడియా తో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రక్రియ పై మాట్లాడకూడదు అని, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కమిషనర్ ల లక్ష్యం గా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు తో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల నేపథ్యం లో జరుగుతున్న ఈ పరిణామాల పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.