ఇది పక్కా బినామీ పొలిటికల్ పిటిషన్!

Tuesday, September 1st, 2020, 02:08:51 AM IST


సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన లో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పథకాలలో వైయస్సార్ ఫోటో ను వాడటం పట్ల హైకోర్టు లో ఒక పిటిషన్ దాఖలు అయింది. అయితే ఈ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అమలు అవుతున్న పథకాల పై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టడం లో తప్పు ఏమి ఉంది అని న్యాయస్థానం తెలిపింది. అంతేకాక వైయస్సార్ గతంలో ముఖ్యమంత్రి గా పని చేసిన విషయాన్ని వెల్లడించారు. అయితే దీని పై విచారణ జరపబోము అని, దీన్ని రెగ్యులర్ బెంచ్ కి వెళ్లాలి అంటూ సూచించడం జరిగింది.

అయితే దీని పై ప్రభుత్వం తరపున న్యాయవాది పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పక్కా బినామీ పొలిటికల్ పిటిషన్ అని తేల్చి చెప్పారు. పిటిషన్ వేసిన వ్యక్తి టీడీపీ కి సానుభూతి పరుడు అని కోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు హయాంలో పసుపు రంగులో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినప్పుడు ఆయనకి సుఖం గా ఉంది అని, టీడీపీ అధికారానికి దూరం కాగానే, ఈయన అంతరాత్మ క్షోభిస్తుంది అని అన్నారు. అయితే మంత్రులు, ఇతర వ్యక్తుల ఫోటోలు ప్రకటనల్లో పెట్టుకోవచ్చు అని గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయాన్ని తెలిపారు.