ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ సూటి ప్రశ్న..!

Tuesday, August 18th, 2020, 02:05:36 PM IST

AP HighCourt gave an another shock to YSRCP government

ఏపీలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్‌ల వ్యవహరం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై నేడు హైకోర్ట్ చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలో విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ శ్రవణ్, ప్రభుత్వానికి మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశిస్తే ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

అయితే ఐదుగురు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని, ఇందుకోసం ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ విన్నవించారు. అయితే ఆ అధికారి ఎవరో చెప్పాలని, ఆధారాలు చూపాలని కోర్టు అడగగా తాను అధికారి పేరుతో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది శ్రవణ్ చెప్పుకొచ్చాడు. అయితే పూర్తి వివరాలతో అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని శ్రవణ్‌ను ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు దీనిపై ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలు ఉన్నా అఫిడవిట్ దాఖలు చేయొచ్చని తెలిపింది. ఈ కేసుపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.