ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్లీ బ్రేక్…నిమ్మగడ్డ పై విజయసాయి రెడ్డి సెటైర్స్

Monday, January 11th, 2021, 07:29:20 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు మరొకసారి వాయిదా పడ్డాయి. తాజాగా విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం, ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్ ను రద్దు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఒకే సమయం లో ఎన్నికలు మరియు వాక్సినేషన్ ప్రక్రియ కష్టతరం అవుతుంది అని ప్రభుత్వం తరపు న్యాయవాది ఏజి వివరించారు. అయితే ఎన్నికల కమిషన్ ఈ నెల 8 న ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయగా, దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.

అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయ్యా నిమ్మగడ్డ గారూ, హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టుకి వెళతారా? లేకపోతే చంద్రబాబు ఇంటికి వెళతారా అంటూ సెటైర్స్ వేశారు.చెప్పండి ప్లీజ్ అంటూ విమర్శించారు. అంతకు ముందు సైతం వరుస విమర్శలు గుప్పించిన విజయసాయి రెడ్డి, ప్రభుత్వం కి అనుకూలంగా తీర్పు రావడం తో మరోమారు గట్టి సెటైర్స్ వేశారు.