ఎన్నికల ప్రక్రియ విషయంలో దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేసిన కోర్టు

Thursday, February 4th, 2021, 01:20:36 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయం లో హైకోర్టు లో పిటిషన్ లు దాఖలు అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దాఖలు అయిన రెండు పిటిషన్ లను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అయితే ఇలా చేయడం ద్వారా రాష్ట్రంలోని 3.6 లక్షల మంది యువత ఓటు హక్కు కోల్పోతున్నారు అని పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే 2021 ఓటర్ల జాబితా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని పిటిషనర్లు ధర్మాసనం కి తెలిపారు.

అయితే కొత్త జాబితా ఇవ్వడం లో ప్రభుత్వం విఫలం అయింది అని, ప్రభుత్వం సహాయ నిరాకరణ వలనే పాత జాబితా అయిన 2019 ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది అంటూ ఎన్నికల కమిషనర్ తరపున న్యాయవాది కోర్టు కి వివరించారు. అయితే ఓటరు జాబితా పై ఎన్నికల కమిషనర్ విచక్షన అంతిమం అంటూ కోర్టు వివరించింది. ఎన్నికల ప్రక్రియ లో ఎలాంటి జోక్యం చేసుకోలేం అంటూ రెండు పిటీషన్ లను కొట్టి వేస్తూ స్పష్టమైన తీర్పు వెల్లడించింది.