గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్..!

Tuesday, November 17th, 2020, 07:12:02 PM IST

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే తాజాగా కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు ఆమె మాదాపూర్‌లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఐశ్వర్య రాజేశ్ మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యమని అన్నారు. రోజురోజుకు పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోతుందని అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి ఆక్సిజన్‌ను పెంచేందుకు సాయపడాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చాలెంజ్‌ను తన అభిమానులు, స్నేహితులు స్వీకరించి మొక్కలు నాటి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాలని, వాటిని తాను షేర్ చేస్తానని తెలిపారు.