ఆ యంగ్ హీరోను డైరెక్ట్ చేయనున్న త్రివిక్రమ్?

Monday, October 26th, 2020, 05:02:23 PM IST

అలా వైకుంఠ పురం లో చిత్రంతో ఫుల్ జోష్ లో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ గా గడిపేస్తున్నారు. ఎన్టీఆర్ తో సైతం త్రివిక్రం శ్రీనివాస్ ఒక సినిమా చేయనున్నారు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక యంగ్ హీరో తో ఒక సినిమా ను చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు హీరోగా ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ పోతినేని ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్, రెడ్ చిత్రం లో చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇంకో సినిమా ను కూడా అనౌన్స్ చేసిన రామ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పక్కగా నటించనున్నారు అంటూ టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. మరి దీని పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ కాంబో జతకడితే టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ విషయం పై అతి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.