మెగాస్టార్ చిరంజీవి దంపతులకు వారి కుమారుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, సురేఖ కొనిదెల 42వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలను తెలియచేశాడు. ఈ మేరకు మెగాస్టార్ దంపతుల ఫోటోను చెర్రీ ట్వీటర్లో షేర్ చేస్తూ మీరే నా బాలం అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు అభిమానులు కూడా మెగాస్టార్ దంపతులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాలతో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత లూసిఫర్, వేదాళం సినిమాలు, ఆ తరువాత దర్శకుడు బాబీతో కూడా ఓ సినిమా చేయనున్నారు.
My biggest strength!!
Wishing you both a very Happy 42nd wedding anniversary 😜❤️!!@KChiruTweets pic.twitter.com/RjFyoPUbCN— Ram Charan (@AlwaysRamCharan) February 20, 2021