స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఇకపై ఎలాంటి ప్రకటన చేయను – హీరో రామ్

Sunday, August 16th, 2020, 05:33:42 PM IST

హీరో రామ్ పోతినేని స్వర్ణప్యాలెస్‌ ఘటనపై నిన్నటి నుంచి వరుస ట్వీట్లు చేస్తున్నారు. సీఎం జగన్ గారు మీ వెనుక పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుందని, మిమ్మల్ని త‌ప్పుగా చూపించ‌డానికి మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్ కి.మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంని అన్నారు. ఫైర్ ప్లస్ ఫీజు ఈజీక్వల్టూ ఫూల్స్ అంటూ అగ్నిప్రమాదాన్ని, ఫీజులను మిక్స్ చేసి జనాలను ఫూల్స్ చేస్తున్నారంటూ కూడా ట్వీట్ చేయడంతో విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు రామ్ పై మండిపడ్డారు.

అయితే ఈ కేసు విచారణకు ఆటంకం కలిగిస్తే రామ్‌కు కూడా నోటీసులు ఇస్తామని, ప్రమాదానికి పూర్తి బాధ్యత ఎవరిది అన్నది ఖచ్చితంగా దర్యాప్తులో తేలుతుందని ఆయన అన్నారు. అయితే తాజాగా నేడు రామ్ ఈ ఘటనకు సంబంధించి మరో ట్వీట్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన అసలైన కుట్రదారులు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారని, వాళ్లు ఎలాంటి వారైనా శిక్ష తప్పదు, చట్టంపై మాకు నమ్మకముందని అన్నారు. అంతేకాదు ఈ వివాదానికి సంబంధించి ఇకపై నేను ఎలాంటి ప్రకటన చేయనని అన్నాడు.