లింగుసామి తో హీరో రామ్ క్రేజీ ప్రాజెక్ట్!

Thursday, February 18th, 2021, 03:41:06 PM IST

హీరో రామ్ పోతినేని వరుస సినిమాలు చేస్తున్నారు. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లింగుసామి దర్శకత్వం లో రామ్ నటించనున్నారు. ప్రొడక్షన్ నంబర్ 6 పేరిట ఈ చిత్రం ను అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే రామ్ ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెడ్ మూవీ తో మంచి థ్రిల్లర్ ను అందించిన రామ్, ఎలాంటి టైమ్ గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరొక క్రేజీ కాంబినేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ చిత్రం తెలుగు తో పాటుగా ఏక కాలంలో తమిళ్ లో కూడా తెరకెక్కనుంది. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న రామ్ , మాస్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నారు. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం ఇంకా చర్చలు జరుగుతున్నాయి. చిత్రం అనౌన్స్ అవ్వడం తో, ఇందులో ఎవరెవరు నటించనున్నారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.