రావల్ ను అభివృద్ధి చేస్తా : హేమామాలిని

Monday, November 10th, 2014, 05:09:06 PM IST

hema-malini
ప్రముఖ బాలివుడ్ నటి.. బీజేపి ఎంపి హేమామాలిని ఉత్తరప్రదేశ్ లోని మధుర నియోజక వర్గంలోని రావల్ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పధకం క్రింద తన నియోజక వర్గంలోని గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు హేమామాలిని తెలిపారు. రావల్ గ్రామాన్ని ఒక ఆదర్శగ్రామంగా తయారుచేస్తామని ఆమె అన్నారు.

మధుర నియోజక వర్గానికి 9కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈరావల్ గ్రామం మహిళా సాధికారికతకు గుర్తుగా.. ఒక చక్కటి పర్యాటకరంగ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎంపి ఈ సందర్భంగా తెలిపారు. ఈనెల 17న రావల్ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులకు పునాది పునాది వేయనున్నట్టు ఎంపి తెలిపారు.