నేను నా ఇంట్లోనే.. ఏ ఇంట్లోకి వెళ్ల‌ను!

Wednesday, July 18th, 2018, 11:42:09 AM IST

`కుమారి 21ఎఫ్` గ్రాండ్ స‌క్సెస్‌తో క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది హెబ్బా ప‌టేల్‌. కుర్ర‌త‌నం, చ‌లాకీత‌నం ఉన్న అందాల యువ‌నాయిక‌గా కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టింది. ఆపై అర‌డ‌జ‌ను ప్రాజెక్టులు చ‌క‌చ‌కా చేసేసింది. కానీ ఏమైందో ఇటీవ‌ల కొన్ని వ‌రుస ప‌రాజ‌యాలు హెబ్బా స్టార్‌డ‌మ్‌ని కిందికి లాగేశాయి. ఇక‌పై ఎట్టి ప‌రిస్థితిలో నిరూపించుకోవాల్సిన సంద‌ర్భంలో `24 కిస్సెస్` అంటూ మ‌రో హీటెక్కించే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈసారి హెబ్బా ప‌ప్పులు ఉడుకుతాయో లేదో తెలీదు కానీ, ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డిపై ర‌క‌ర‌కాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

నాని హోస్టింగ్ చేస్తున్న బుల్లితెర రియాలిటీ షో `బిగ్‌బాస్`లోకి హెబ్బా ప్ర‌వేశించ‌బోతోంద‌ని, హౌస్ ప్ర‌వేశానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఉప‌యోగిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇదే విష‌యం హెబ్బా దృష్టికి వెళ్ల‌డంతో త‌ను క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. “నేను ఓన్లీ మా ఇంట్లోనే ఉన్నాను. ఎవ‌రి ఇంట్లోకి వెళ్లే ఆలోచ‌న లేదు. నేను ఎలాంటి రియాలిటీ షోలు చేయ‌ను“ అంటూ ఖ‌రాకండిగా చెప్పేసింది. దీంతో బిగ్‌బాస్‌లో హెబ్బా మెరుపులు ఉండ‌బోవ‌ని క్లారిటీ వ‌చ్చేసిందిక‌.