భారీ వర్షాలు: తెలంగాణ లోని ఆ ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్

Tuesday, October 13th, 2020, 10:03:59 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పాల్ చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే రెండు రోజుల్లో ఇంకా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది అని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ పలు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. తూర్పు మరియు మద్య తెలంగాణ జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ను ప్రకటించింది. అయితే ఇదే నేపద్యం లో హైదరాబాద్ ను ఆరంజ్ జోన్ గా ప్రకటించడం జరిగింది.

రాష్ట్రం లోని లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి అని సూచించడం జరిగింది. అయితే హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి హిమాయత్ సాగర్ లోకి భారీగా వరద నీరు చేరడం తో GHMC, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులను జల మండలి దాన కిశోర్ అప్రమత్తం చేశారు. అయితే అవరసం ఉంటేనే తప్ప బయటికి రావొద్దు అంటూ అధికారులు తెలుపుతున్నారు. ప్రజల కూడా అప్రమత్తం గా ఉండాలి అని అంటున్నారు.