నిన్నటి వరకు చెన్నైని.. ఇప్పుడు ఇంగ్లాండ్ ని..!

Sunday, December 6th, 2015, 05:39:14 PM IST

flood
నిన్నటి వరకు చెన్నై మహానగరాన్ని వరదలు ముంచెత్తాయి. నైరుతిరుతు పవనాలతో పాటు.. బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వలన చెన్నై నగరంలో మూడు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా చెన్నై నగరం నీటమునిగింది. జీవనం అస్తవ్యస్తమయింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు కాస్త వర్షం తెరిపించడంతో.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది.

ఇక, ఇదిలా ఉంటే, అటు ఉత్తర ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లోని కొన్ని ప్రాంతాలపై డెస్మండ్ తుఫాను విరుచుకు పడింది. ఈ తుఫాను ధాటికి ఉత్తర ఇంగ్లాండ్ లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు భారీగా రావడంతో.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలా చోట్ల అధికారులు వరద హెచ్చరిక జారీ చేశారు. జలమయమయిన లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను ఖాళీ చేయించి అక్కడినుంచి తరలిస్తున్నారు.