ముంబై లో దారుణం : భారీ అగ్నిప్రమాదం – మృతదేహాలు వెలికితీత

Saturday, December 28th, 2019, 08:23:28 AM IST

ఇటీవల దేశ రాజధాని ఢిల్లోలో జరిగిన వరుస అగ్నిప్రమాదాల విషయం ఇంకా మరవక ముందే, తాజాగా మహానగరమైన ముంబైలో మరొక భారీ అగ్నిప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే… శుక్రవారం అర్ధరాతి దాటాకా ముంబై లోని ఘాట్కోపర్ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా వ్యాపించిన ఆ మంటల్లో చాలా మంది చిక్కుకున్నారు. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. అప్పటికే ఆ మంటల్లో చిక్కుకొని చాలా మంది మరణించారని సమాచారం. కాగా మంటలు అదుపులోకి వచ్చాక ఆ మంటల్లో చిక్కుకొని మరణించిన వారిలో ఒక మహిళ, ఒక పురుషుని మృతదేహాలను వెలికితీసినట్టు సమాచారం. మిగిలిన మృతదేహల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈమేరకు మాట్లాడిన అగ్నిమాపకదళ అధికారి విజయ్ కుమార్… మిగిలిన మృతదేహాలకోసం వెలికితీత పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు.