బిగ్ న్యూస్ : కాకినాడలో పవన్ పై కూడా దాడి..?

Tuesday, January 14th, 2020, 01:30:00 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హుటాహుటిన వెళ్లిన ఢిల్లీ టూర్ ముగిసిపోయింది.అయితే అలా పవన్ టూర్ కు వెళ్లిన అనంతరం కాకినాడలో ఒక్కసారిగా ఉధృతమైన పరిస్థితులు నెలకొన్నాయి.ఇక్కడ కామెడీ ఏమిటంటే అక్కడ అల్లర్లకు పాల్పడిన వారు ఎవరో కూడా అందరికి తెలుసు కానీ జగన్ మీడియా మాత్రం ఏమాత్రం విలువలు కానీ నైతకత కానీ లేకుండా నిస్సిగ్గుగా జనసేన వాళ్ళు దాడులు చేసారని ప్రచారం చేసారు.మరి ఎందుకు వారు ఇంతలా విషం చిమ్ముతున్నారో వారికే తెలియాలి.దీనితో జనసేన పార్టీ అధినేత ఢిల్లీ లో ఉండగానే ఇక్కడ జరిగిన కల్లోలంపై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

అంతే కాకుండా తానూ కాకినాడ వస్తున్నానని కూడా సంచలన ప్రకటన చెయ్యడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.అయితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకున్నట్టయితే వైసీపీ వాళ్ళు మాత్రం పవన్ వచ్చినప్పుడు కూడా మొన్నటిలానే అల్లర్లు చెయ్యాలని అంతే కాకుండా సందట్లో సడేమియాలా దాడులు చెయ్యడానికి కూడా తెగబడినా తెగబడతారని పవన్ కు అక్కడ ఉండే జనసేన శ్రేణులు అంతా అలెర్ట్ అవుతున్నారు.ఒకవేళ అలా కానీ జరిగినట్లయితే ఇక అక్కడి పరిస్థితులు కంట్రోల్ చెయ్యడం ఎవరి తరమూ కాదని చెప్పాలి.ఎందుకంటే మొన్ననే పోలీసులు ఏక పక్షంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థ పరువు తీసేసారు.మరి పవన్ రాకతో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి చూడాలి.