బిగ్ న్యూస్: మరో మంత్రి కి సోకిన కరోనా

Sunday, August 9th, 2020, 10:12:54 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా విడిచి పెట్టడం లేదు. ఇప్పటికే దేశం లో భారీ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు కి కరోనా వైరస్ సోకింది. కొద్ది రోజుల నుండి జ్వరం మరియు అనారోగ్య సమస్యల తో బాధపడుతుండటంతో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే రిపోర్ట్ లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఆదివారం నాడు పరీక్షలు చేయించుకో గా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

అయితే ఈ విషయాన్ని స్వయం గా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చిన అప్పటి నుండి ప్రతి జిల్లాలో కూడా విస్తృతంగా పర్యటించిన విషయాన్ని తెలిపారు. అయితే తనకు పరీక్షా సమయం ఎదురు అయింది అని అన్నారు. ఆసుపత్రి లో చేరి చికిత్స పొందుతాను అని వ్యాఖ్యానించారు. అయితే కర్ణాటక లో ఇప్పటికే సీఎం ఎదియురప్పా, సి ఎల్పీ నేత సిద్ధ రామయ్య లకు కరోనా రగ, తాజాగా మంత్రి కి కరోనా సోకడం పట్ల ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.