కరోనా పై పోరు తుది దశకు చేరుకుంది – హర్షవర్ధన్

Wednesday, January 27th, 2021, 09:26:02 AM IST

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారి చేతికి బలి అయ్యాయి. అయితే కరోనా పై పోరు లో లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కొంతమంది అనారోగ్యం పలు అయ్యారు. అయితే వర్చువల్ గా జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశం లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి ను ఓడించేందుకు యావత్ ప్రపంచం చేస్తున్న పోరు తుది దశకు చేరుకుంది అని అన్నారు. ఈ మహమ్మారి ను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చూపిన చొరవ, ముందస్తు వ్యూహాలు, పరస్పర సహకారం వలనే సాధ్యం అయింది అని చెప్పుకొచ్చారు.

మహమ్మారి తెచ్చిపెట్టిన ప్రతికూల పరిస్థితుల వలన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు ఏకతాటి పైకి వచ్చే అవకాశం కలిగింది అని అన్నారు.అయితే ఇంకా పూర్తి స్థాయిలో కరోనా తొలగిపోలేదు. ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు మరింత పటిష్టం చేయాలని సూచించారు. యావత్ ప్రపంచం సురక్షితంగా ఉంటేనే మనం భద్రం గా ఉంటామని, లేదంటే ముప్పు తప్పదు అని హెచ్చరించారు. వీటి పరిష్కారం కోసం ప్రపంచం ఆరోగ్య సంస్థ సమర్థమైన వ్యూహాలతో మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.