పల్లెలకి పాకిపోయిన కరోనా.. ఆరోగ్య శాఖ ముందస్తు హెచ్చరిక..!

Monday, August 3rd, 2020, 08:57:30 AM IST

Corona_2506

ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముందు దేశంలో, ఆ తరువాత రాష్ట్రంలో తరువాత జిల్లాలలోకి వ్యాపించిన కరోనా ఇప్పుడు పల్లెలకు కూడా పాకిపోతుంది. పల్లెలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండదని భావించిన చాలా మంది నగరాలను, పట్టణాలను వీడి పల్లెలకు చేరుకోవడంతో ఇప్పుడు పల్లెలలో కూడా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఇక ముఖ్యంగా తెలంగాణ పల్లెలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపు 270 మండలాలు, 1500 గ్రామాలలోకి వైరస్ వ్యాప్తి చెందినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రతి పల్లెలో 150 వరకు కొత్త ముఖాలు ఉన్నట్టు ఫీవర్ సర్వే ద్వారా గుర్తించింది. ఉపాధి కోల్పోయి నగరాల నుంచి గ్రామాలలోకి వచ్చిన వారి నుంచే వైరస్ వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. సెప్టెంబర్‌లో 5 వేల గ్రామాలకు కరోనా వ్యాపించే అవకాశం ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.