మరొక ముఖ్యమంత్రికి సోకిన కరోనా

Monday, August 24th, 2020, 11:08:02 PM IST


కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే ఈ మహమ్మారి భారిన పడి రోజుకి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వేల సంఖ్య లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కున్నారు.అయితే సోమవారం నాడు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే గత కొద్ది రోజుల నుండి ముఖ్యమంత్రి ను కలిసిన వారు కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు.

అయితే ఇప్పటికే దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎంపీ ల తో సహా పలువురు కరోనా వైరస్ భారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి కి కరోనా సోకడం ఆ రాష్ట్ర ప్రజలను మరింత ఆందోళన కి గురి చేస్తోంది.