దళితులకు న్యాయం జరగడంలేదు.. మాజీ ఎంపీ హర్షకుమార్ సీరియస్ కామెంట్స్..!

Sunday, September 27th, 2020, 03:00:36 AM IST


ఏపీలో దళితులపై దాడులు ఆగడం లేదని, దళితులపై జరిగిన దాడుల కేసులలో న్యాయం జరగడం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నేడు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ చీరాల యువకుడు కిరణ్‌ కేసును విచారణకు వచ్చే సమయానికి ఉపసంహరించుకున్నారని, దీంతో ఆ కేసులో తానే పిల్ వేయాల్సి వచ్చిందని అన్నారు.

అంతేకాది అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు జైల్లో వేశారని అన్నారు. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ టార్గెట్ చేశాయని కూడా అన్నారు. రైలు దహనం ఘటనలో కాపులపై కేసులు ఎత్తివేశారని, రిలయన్స్‌ మాల్స్‌పై దాడులు, ముస్లిం యువతపై పెట్టిన కేసులు ఎత్తివేశారని కానీ దళితులపై ఉన్న ఒక్క కేసును కూడా ఎత్తివేయలేదని మండిపడ్డారు.