బీజేపీకి బుద్ధి చెప్పే అవకాశం.. దుబ్బాక ప్రజలకు హరీశ్ రావు సూచనలు..!

Sunday, September 20th, 2020, 06:00:11 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం వాడీ వేడీగా జరుగుతుంది. ఇంకా ఎన్నిక డేట్ పిక్స్ కాలేదు, అభ్యర్థులు ఖరారు కాలేదు అప్పుడే ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్రతరం చేశారు. అయితే దుబ్బాక ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్ తరఫున అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి హరీశ్ రావు టీఆర్ఎస్ శ్రేణులలో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారు. అయితే నేడు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు బీజేపీపై విమర్శలు గుప్పించారు.

కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం ప్రకారం బావులకు, బోర్లకు మీటర్లు పెట్టాలంటున్న బీజేపీకి బుద్ధి చెప్పే అవకాశం దుబ్బాక ప్రజలకు వచ్చిందని, యావత్ తెలంగాణ దుబ్బాక ప్రజల వైపు చూస్తుందని అన్నారు. ఆఫ్రికా మక్కలు దిగుమతి చేస్తామని బీజేపీ అంటుందని, అలా చేస్తే తెలంగాణ రైతుల మక్కలు ఎవరు కొంటారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల తరఫున దుబ్బాక ప్రజలు తమ ఓటుతో బీజేపీని చావు దెబ్బ కొట్టాలని అన్నారు.