రైతులకు భరోశా కల్పించాలి!

Friday, December 12th, 2014, 03:17:45 PM IST


తెలంగాణ భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రుణ పరిమితిపై తాజ్ డక్కన్ లో జరిగిన నాబార్డు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డు దృక్కోణం మారాలని, రైతులకు భరోశా కల్పించాలని పేర్కొన్నారు. అలాగే రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని హరీష్ రావు సూచించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ రుణాలు ఇస్తున్న స్కేల్ ఆఫ్ ఫైనాన్సు సరిగా లేదని, పంటల భీమా విధానంలో మార్పు రావాలని సూచించారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలని, మిషన్ కాకతీయకు వెయ్యి కోట్లు కేటాయించాలని హరీష్ రావు విజ్ఞ్యప్తి చేశారు. ఇక సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నాబార్డు రుణ ప్రణాళిక తమకు కొండంత అండను ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.