ఓటమికి నాదే బాధ్యత.. దుబ్బాక ఫలితంపై హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్..!

Tuesday, November 10th, 2020, 09:00:57 PM IST

దుబ్బాక ఉప ఎన్నిక ఓటమిపై స్పందించిన మంత్రి హరీశ్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి తనదే బాధ్యత అని ఒప్పుకున్నారు. ఉప ఎన్నికలో దుబ్బాక ప్రజాతీర్పును శిరసావహిస్తామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికి కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఓటమికి గల కారణాలను సమీక్షించుకొని లోపాలను సరిదిద్దుకుంటామని అన్నారు. ఓడినా, గెలిచినా తాను ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటానని, దుబ్బాక ప్రజలకు కూడా తాను అందుబాటులో ఉంటానని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. ఇక్కడి ప్రజలకు, కార్యకర్తలకు అన్ని విధాల తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.