మూడు సార్లు ప్లాస్మా దానం.. పోలీస్ కానిస్టేబుల్‌కు హరీశ్ రావు ప్రశంసలు..!

Saturday, August 29th, 2020, 12:17:57 AM IST


తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసి మరొకరికి సాయపడాలని ప్రభుత్వంతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా కోరుతున్నారు. అయితే ఓ కానిస్టేబుల్ కరోనా నుంచి కోలుకుని ఏకంగా మూడు సార్లు ప్లాస్మా దానం చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు.

అయితే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా ఆ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘కరోనాను గెలవడమే కాకుండా ప్లాస్మా దానంచేసి అందరి మనసులూ గెలిచిన సిద్ధిపేట జిల్లా.. రాయపోల్ పోలిస్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కు అభినందనలు. మూడుసార్లు ప్లాస్మా దానం చేసిన నీపెద్దమనసు అందరికీ ఆదర్శం. కరోనా పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలను నీలాంటి యువకులే తొలగించగలరు. తెలంగాణసమాజం నిన్నుచూసి గర్విస్తోంది అంటూ ట్వీట్ చేశారు.