తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ నియామకంపై సరికొత్త వివాదం..!

Tuesday, March 9th, 2021, 11:26:51 PM IST

తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేం దేత్తడి హారికను నియమించడం ఇప్పుడు సరికొత్త వివాదంగా మారింది. మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న హారికను తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాసగుప్త నియామక పత్రాన్ని అందజేశారు.

అయితే పర్యాటకశాఖ మంత్రి, సీఎంవో అధికారులకు తెలపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని హారికను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తపై అధికారులు సీరియస్ అయ్యారు. అంతేకాదు హారిక వివరాలను టూరిజం శాఖ వెబ్‌సైట్ నుంచి తొలగించి మళ్ళీ ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూసుకోవాలని అధికారులు ఉప్పల శ్రీనివాస్ గుప్తాను మందలించారు. అయితే బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకం చేసిన తర్వాత ఆ వివరాలను తొలగించడం పలు అనుమానాలకు తావిస్తుంది.