సర్దార్ పటేల్ పై ఈగ వాలనివ్వని బీజేపీ ఇప్పుడు అవమానిస్తోంది – హర్ధిక్ పటేల్

Thursday, February 25th, 2021, 08:30:11 AM IST

మోతెరా క్రికెట్ స్టేడియం పేరు తాజాగా మార్చివేసిన సంగతి అందరికీ తెలిసిందే. అహ్మదాబాద్ లో ఉన్నటువంటి ఈ స్టేడియం ను నూతనంగా మళ్ళీ ఏర్పాటు చేశారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య ముడవ టెస్ట్ మ్యాచ్ నేపథ్యం లో దీన్ని రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. అయితే ఈ స్టేడియం ను ఇప్పటి వరకూ కూడా సర్దార్ పటేల్ స్టేడియం అని పిలిచేవారు. అయితే ఈ స్టేడియం ను పూర్తి గా ఆధునీకరించిన తర్వాత దీనికి నరేంద్ర మోడీ మైదానం గా పేరు మార్చడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయం పట్ల పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. దీని పై పలువురు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయితే సర్దార్ పటేల్ ను అవమానించడమే అంటూ కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేత హర్డిక్ పటేల్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు సర్దార్ పటేల్ పై ఈగ వాలనివ్వని బీజేపీ ఇప్పుడు అవమానిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోడీ మైదానం గా మార్చడం ను తప్పుబట్టారు. ఇలా మార్చడం సర్దార్ పటేల్ కి అవమానం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. సర్దార్ జీ ను అగౌరవ పరిచే చర్యలను గుజరాత్ ప్రజలు ఎంతమాత్రం సహించరు అంటూ వ్యాఖ్యానించారు. భారత రత్న, లోక పురుషుడు సర్దార్ పటేల్ భారతదేశం లోని ప్రతి పౌరుడి పై ప్రభావం చూపారు అంటూ చెప్పుకొచ్చారు.