అనాధ పిల్లల కోసం హన్సిక ఆరాటం!

Sunday, February 22nd, 2015, 05:44:54 PM IST

Hansika-to-build-a-home-for
దక్షిణాది చిత్రాలలో ఒక వెలుగు వెలుగుతున్న అందాల నటి హన్సిక కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. కాగా ఇటీవలే విదేశాలలో పులి చిత్రం కోసం పాటల చిత్రీకరణలో పాల్గొని వచ్చిన హన్సిక ప్రస్తుతం తమిళ హీరో విజయ్ నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో ప్రముఖ నటి, అతిలోక సుందరి శ్రీదేవికి కుమార్తెగా నటిస్తున్నారు. ఇక మరో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఇలా ఎనిమిది చిత్రాలకు పైగా నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ హన్సిక మాత్రం కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

అయితే దీనికి కారణం మాత్రం హన్సిక తన దత్తత పిల్లలతో గడపాలని అనుకోవడమేనని సమీప వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక పాతికేళ్ళ హన్సిక ఇప్పటికే పుట్టిన రోజుకు ఒకళ్ళు లేదా ఇద్దరు, ముగ్గురు చొప్పున మొత్తం 30మంది అనాధ పిల్లలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే, కాగా వారిలో కొందరికి ఆరోగ్యం బాగోకపోవడంతో కొంత కాలం సినిమాలకు చెక్ పెట్టి ఆ పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నారని సమాచారం.