కేసీఆర్ ను బలహీనపరిస్తే తెలంగాణ సమాజమే బలహీనం అయినట్లు అవుతుంది

Thursday, November 12th, 2020, 12:28:55 PM IST

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్ పాలన విధానం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శం అని అన్నారు. రైతులు అధికారులకు, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అయితే ఈ మధ్య కొంతమంది కేసీఆర్ ను ఇబ్బందులకు గురి చేయాలని, బలహీనపరచాలని చూస్తున్నారు అని ఆరోపించారు. అయితే కేసీఆర్ ను బలహీన పరిస్తే తెలంగాణ సమాజమే బలహీనం అయినట్లు అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కెసిఆర్ లేకపోతే ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా మారిపోతుంది అంటూ స్పష్టం చేశారు. అయితే కొన్ని పార్టీలు విద్వేష పూరితంగా, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నాయి అని మండిపడ్డారు. అయితే ఇది చాలా దురదృష్టకరం అని, తెలంగాణ కి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని తెలిపారు. అంతేకాక రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని, అంత కూడా ప్రజల సంక్షేమం కోసం పాటు పడాలి అంటూ హితవు పలికారు.