జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల..!

Friday, January 22nd, 2021, 11:37:08 PM IST


జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారయ్యింది. మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారధి నేడు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం 12:30 నిమిషాలకు మేయర్ ఎన్నిక, ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపట్టనున్నట్టు ప్రకటించింది.

అయితే ఎన్నికల పర్యవేక్షణకు ఓ ఐఏఎస్ స్థాయి అధికారిని ఎన్నికల సంఘం నియమించింది. ఏదైనా కారణాలతో ఫిబ్రవరి 11న ఎన్నిక నిర్వహించలేని పక్షంలో ఫిబ్రవరి 12న ఎన్నిక నిర్వహిస్తామని తెలుస్తుంది. ఇదిలా ఉంటే గ్రేటర్లోని మొత్తం 150 వార్డులకు గత ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగగా అధికార టీఆర్ఎస్ పార్టీ 56 వార్డులు గెలుచుకోగా, బీజేపీ 48 వార్డులు, ఎంఐఎం 44 వార్డులు కైవసం చేసుకున్నాయి. అయితే ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈసారి మేయర్ ఎవరవుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.