‘పప్’ కు ఘనంగా వీడ్కోలు

Monday, March 30th, 2015, 09:51:34 AM IST


పప్ ఆస్ట్రేలియా వాసులకు ఇష్టమైన పేరు. 2015 ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా సాధించడంతో ఈ పేరు అక్కడ మారు మ్రోగిపోతున్నది. ఇంతకీ ఈ పప్ అంటే ఎవరనుకున్నారు. ఇంకెవరు ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్. అవును అక్కడ అందరు క్లార్క్ ను ముద్దుగా పప్ అని పిలుస్తారు. ఈనెల 26న ఇండియా ఆస్ట్రేలియా ల మధ్య జరిగిన సెమిస్ తరువాత తానూ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు క్లార్క్ ప్రకటించాడు. ఇదే తన చివరి వరల్డ్ కప్ అని 33 ఏళ్ల క్లార్క్ ప్రకటించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా షాక్ తిన్నది. సక్సెస్ ఫుల్ కెప్టెన్ లలో ఒకడిగా పేరుపొందిన క్లార్క్ ఈ నిర్ణయం తీసుకోవడంతో జట్టు సభ్యులు అతనికి ఘనమైన వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు. కప్ గెలిచి పప్ కు ఘనంగా వీడ్కోలు పలకాలని భావించారు. అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా జట్టు విశ్వవిజేతగా నిలిచింది.

ఇక, 2011లో పాంటింగ్ రిటైర్మెంట్ అనంతరం మైఖేల్ క్లార్క్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా, క్లార్క్ గాయాలతో బాధపడుతూ… పెరుగుతున్న పోటీ ఎదుర్కొంటూ, విమర్శలను సహిస్తూ జట్టును ముందుకు నడిపించాడు. ఇక, వరల్డ్ కప్ కు ముందు ఇండియా తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ కు క్లార్క్ దూరంగా ఉన్నాడు. వరల్డ్ కప్ కు పూర్తీ ఫిట్ నెస్ తో వస్తానని చెప్పిన క్లార్క్ చెప్పినట్టే ఫిట్ నెస్ తో వరల్డ్ కప్ కు వచ్చాడు. ఇక తన కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలవడంతో గౌరవప్రదంగా ఉంటుందని భావించి క్లార్క్ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు