తెలంగాణలో క్రమక్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు..!

Monday, August 17th, 2020, 10:13:04 AM IST

తెలంగాణలో గత రెండు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 894 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 10 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,0006 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 92,255 చేరగా, కరోనా నుంచి కోలుకుని 70,132 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 21,420 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 703కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 8,794 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 7,53,349 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 76.01 శాతంగా ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.