బిగ్ న్యూస్: ఆ పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ లో చేరండి!

Sunday, February 23rd, 2020, 09:57:48 PM IST

ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సిపిఐ నేతల ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. కమ్యూనిస్ట్ పార్టీలంటే గతంలో గౌరవం ఉండేదని కానీ, నారాయణ, రామకృష్ణ లాంటి వ్యక్తులు వచ్చాక ఆ పార్టీల ఫై గౌరవం పోయిందని సంచలన వ్యాఖ్యలు చేసారు. సిపిఐ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యల ఫై శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టులు చదివే బదులు పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ లో చేరండి అని విమర్శించారు. వైసీపీ మైనార్టీల పార్టీ పక్ష పార్టీ అని, సెక్యూలర్ పార్టీ అని అందరికి తెలుసు అని అన్నారు.

వారి వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణ, నారాయణ లకు టీడీపీ నుండి డబ్బులు అందుతున్నాయని సంచలన ఆరోపణలు చేసారు. ప్రతిరోజూ రామకృష్ణ లోకేష్ బండి ఎక్కుతారు అని అన్నారు, డబ్బులు తీసుకుంటారని టీడీపీ యే ప్రచారం చేస్తుందని ఘాటు విమర్శలు చేసారు. ఎన్నికల ముందు చంద్రబాబు వైసీపీ కి, బీజేపీ కి అక్రమ సంబంధం అంటగట్టాలని చూసారు. కానీ, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత బీజేపీ తో సంబందాలు నడుతుపుతున్నది టీడీపీ కాదా అని ప్రశ్నించారు.