తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన గవర్నర్‌ తమిళిసై..!

Wednesday, February 3rd, 2021, 10:52:32 PM IST


తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై ఘాటు లేఖ రాశారు. వీసీల నియామకంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలోని 11 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉండగా ఛాన్సలర్ పోస్టులను ఇప్పటి వరకూ భర్తీ చేయకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పది రోజుల్లోగా ఖాళీగా ఉన్న ఛాన్సలర్ లను నియమించాలని ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై డెడ్ లైన్ విధించారు.

అయితే వీసీల నియామకం కోసం జులై 23, 2019 న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్లుగా వీసీల నియామక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉన్నత విద్యపై నిర్లక్ష్యం, వీసీలను నియమించకపోవడంపై కొద్ది రోజుల క్రితం గవర్నర్ ని కలిసి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఇన్‌చార్జ్‌ వీసీలు, రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గవర్నర్‌ తమిళిసై పూర్వ విద్యార్థులను యూనివర్సిటీ తో అనుసంధానంపై ఆరా తీశారు.