సర్కార్లకు సవాల్ గా సమాచార హక్కు చట్టం

Monday, September 29th, 2014, 06:16:26 PM IST


భారత పౌరుల ఆయుధం.. ఏక్కడ అవినీతి జరిగినా.. ప్రభుత్వ పథకాల అమలు తీరు.. కావాల్సిన సమాచార సేకరణ.. తదనుగుణంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వెపన్.. అదే సమాచార హక్కు చట్టం. కానీ రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇప్పుడు ప్రభుత్వాలకు సవాల్ గా మారుతోంది. ప్రజలకు ప్రభుత్వాలు జవాబుదారితనంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం కల్పించిన సమాచార హక్కు చట్టం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో, కొందరు అడుగుతున్న ప్రశ్నలతో ప్రభుత్వం, అధికారులు ఇబ్బంది గురి కావాల్సి వస్తోంది. కేవలం పది రూపాయలు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ తో కావాల్సిన సమాచారాన్ని ఆర్టీఐ నుంచి పొందవచ్చు. అవినీతి కి తావులేకుండా.. పథకాల అమలులో జాప్యం జరుగకుండా.. ఆయా పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా?.. ప్రభుత్వం వద్ద ఫైళ్ల పరిస్థితి ఏంటీ?.. ఆయా సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వానికి పెట్టుకున్న విజ్ఞాప్తుల పరిస్థితి ఏంటీ అని తెలుసుకునేందుకు అద్దంలా ఉపయోగపడే చట్టం ఆర్టీఐ.

ఇక ఇప్పుడు ఈ ఆర్టీఐ యే ప్రభుత్వాలకు, అధికారులకు ఇబ్బందిగా మారుతోంది. వ్యక్తులు, సంస్థలు నేరుగా ఆర్టీఐ ద్వారా పొందాల్సిన సమాచారాన్ని అడగకుండా… వారు తమకు తోచిన పలు అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అందులో పొందుపర్చుతూ ప్రభుత్వాన్ని, అధికారులను ఇరుకాటం లో పెడుతున్నారు. సమాచారాన్ని కోరుతున్న వ్యక్తులు, సంస్థలు ఒకటికి బదులుగా పదుల సంఖ్యలో ప్రశ్నలు అందులో పొందుపర్చడం.. సమాచార శాఖ ఈ ప్రశ్నల ప్రతులను ఆయా శాఖలకు జీరాక్స్ లను పంపించాల్సి వస్తోంది. ఇది ఒకసమస్య అయితే.. రీప్లై ఇవ్వడానికి ఇచ్చే సమయంలోపే సమాచారాన్ని అన్ని విభాగాలు సిద్ధం చేయలేకపోతున్నాయి. రోటిన్ విధులను నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు ఇది మరింత భారంగా మారింది. మరోవైపు ఆయా వ్యక్తులు స్పష్టంగా కావాల్సిన సమాచారాన్ని కోరకుండా.. ఇష్టమచ్చిన సమాచారం కావాలని అడగడం అధికార యంత్రాగానికి ఇదో సవాల్ గా మారుతోంది.

సమాచార హక్కు చట్టం ఉద్దేశం మంచిదైనా.. అది దుర్వినియోగం కాకుండా చూడాల్సిన విధంగా నిబంధనాలు ఉండాలంటున్నారు విశ్లేషకులు. లేకుంటే.. ఒక ప్రశ్నకు కాకుండా అనవసరపు, అదనపు ప్రశ్నలకు సమాధానం చెప్పలాంటే.. ఆయా శాఖల వారిగా ప్రత్యేకంగా ఒకొక్క విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. అనవసరపు ప్రశ్నల విషయంలో ప్రాథమికంగా కట్టడి చేసి… నేరుగా ఒక వ్యక్తి లేదా సంస్థ ఒకే ప్రశ్న వేసేలా ఆర్టీఐ రూల్స్ ఉండాలంటున్నారు.