కేసీఆర్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్‌ తమిళిసై..!

Tuesday, August 18th, 2020, 03:11:45 PM IST

KCR_tamilsai

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయ్యిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయాలనికి ప్రభుత్వానికి సూచనలు చేసినా, ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని అన్నారు.

అయితే ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం సమర్ధించుకుంటుందని అన్నారు. కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వసతులు కల్పించామని చెబుతున్నా కరోనా రోగులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులంటే భయపడుతున్నారని సీఎం కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు ఈ విషయాల గురుంచి చర్చించానని అన్నారు.