టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతుంది.. గోరంట్ల సంచలన వ్యాఖ్యలు..!

Monday, March 29th, 2021, 05:30:05 PM IST

టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్‌టీఆర్ పార్టీలోకి రావాలని చాలా మంది నుంచి వినిపిస్తున్న మాట. కొద్ది రోజుల నుంచి పార్టీలో సీనియర్లు కూడా ఇదే మాట మీద ఉన్నారు. టీడీపీనీ స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించి నేటికి 40 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా తెలుగు రాష్టాల్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో పార్టీ కేడర్‌లో మాత్రం జోష్ కనిపించడం లేదు.

అయితే నేడు రాజమండ్రిలో టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో భారీగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయని గోరంట్ల అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని, ఇప్పుడు వైసీపీ దమనకాండను ఎదుర్కొంటోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న క్షేత్ర స్థాయి పరిస్థితులను బట్టి పార్టీలో కొత్త నాయకత్వం రాబోతుందని, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు నేతలు టీడీపీ బలోపేతం కోసం పనిచేయాలని అన్నారు.