గోపీచంద్ మూవీ టైటిల్ పవన్ పాటతో ?

Thursday, February 23rd, 2017, 11:28:31 PM IST


ప్రస్తుతం ఆక్సీజన్ చిత్రంలో నటిస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమాతో పాటు అయన మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే బి గోపాల్ దర్శకత్వంలో మూడేళ్ళ క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా ఇంకా పూర్తీ కాలేదు సరికదా .. ఎప్పుడు విడుదల అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ? గోపీచంద్ సరసన నయనతార నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ గా ఓ టైటిల్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా .. ”వీడు ఆరడగుల బుల్లెట్టు” ? పవర్ స్టార్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పవర్ ను తెలిపే సాంగ్ ఇది .. ఈ పాటలోని ఆరడుగుల బుల్లెట్టు టైటిల్ ని కొద్దిగా మర్చి, వీడు ఆరడుగుల బులెట్ అనే టైటిల్ పెట్టారట !! ఇక ఈ సినిమా మూడేళ్లయినా షూటింగ్ పూర్తీ కాకపోవడానికి ముఖ్య కారణం నయనతార అని తెలిసింది. ఈ సినిమాకోసం ఆమె కాల్షీట్స్ ఇవ్వడం లేదట. కావాలనే నయనతార సతాయిస్తుందని అంటున్నారు. నయనతార ఈ సినిమాకోసం ఇంట్రెస్ట్ పెడితే సినిమా పూర్తవుతుందని అంటుంది చిత్ర యూనిట్. మరి నయనతార ఈ సినిమా ఎప్పుడు పూర్తీ చేస్తుందో .. ? ఆ సినిమా ఎప్పుడు బయటికి వస్తుందో చూడాలి !!