బ్రేకింగ్: ప్లే స్టోర్ నుండి పేటీయం యాప్ తొలగింపు

Friday, September 18th, 2020, 05:27:50 PM IST

ప్లే స్టోర్ నుండి పే టి యం యాప్ తొలగిస్తూ గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తో యూజర్స్ అంతా కూడా ఒక్కసారిగా షాక్ కి గురి అయినట్లు తెలుస్తోంది. అయితే గ్యాంబ్లింగ్ ను ప్రమోట్ చేసే అప్లికేషన ను ఆమోదించబోము అని తేల్చి చెప్పింది.అయితే శుక్రవారం నాడు, గూగుల్ తన బ్లాగ్ లో understanding our Play gambling policies in India అంటూ ఒక ప్రకటన చేసింది.

అయితే ఈ ప్రకటన లో పలు కీలక విషయాలను వెల్లడించడం జరిగింది. భారత్ లో జుదాన్ని, ఆమోదించే ప్రోత్సహించే అప్లికేషన్ లను కొన్నిటిని హైలెట్ చేయడం జరిగింది. అయితే వినియోగదారుల సురక్షితను దృష్టి లో ఉంచుకొని గూగుల్ ప్లే ను రూపొందించడం జరిగింది అని, డెవలపర్ లకు ఒక వ్యాపారం ను నిర్మించడానికి, అంటూ కొన్ని విషయాలను తెలిపింది అయితే పే టి యం కి సంబంధించిన ఇతర యాప్ లను కూడా తొలగించడం జరిగింది.