10 నిమిషాల పాటు గూగుల్ సర్వర్లు డౌన్.. యూజర్ల ఇబ్బందులు..!

Monday, December 14th, 2020, 06:20:46 PM IST

ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల గూగుల్ సర్వీసులు నిలిచిపోయాయి. జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ హోమ్, గూగుల్ డ్రైవ్, క్యాలెండర్, మీట్ తదితర సర్వీసులన్ని పనిచేయలేదు. అయితే వీటితో పాటు గూగుల్ ప్లే స్టోర్ సర్వీసులో కూడా అంతరాయం ఏర్పడింది. అయితే గూగుల్ సర్వర్లు డౌన్ అవ్వడంతో సోషల్ మీడియా ద్వారా వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. దాదాపు పది నిమిషాల పాటు ఈ సేవలు నిలిచిపోయాయి. అయితే వెంటనే అప్రమత్తమైన గూగుల్ సాంకేతిక నిపుణులు సమస్యను చక్కదిద్దడంతో మళ్లీ గూగుల్ సేవలు పనిచేస్తున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే సేవలు తిరిగి ప్రారంభమైనట్లు తెలుస్తుంది.