ఐక్యజర్మనీపై గూగుల్ డూడుల్

Sunday, November 9th, 2014, 01:40:40 PM IST


జర్మనీ చరిత్రలో ఈ రోజు మరుపురాని రోజు. తూర్పు…పశ్చిమ జర్మనీలను విడగొడుతూ బెర్లిన్ మధ్యలో నిర్మించిన.. బెర్లిన్ గోడను కూల్చివేసిన ఘటనకు నేటితో 25వసంతాలు పూర్తయ్యాయి. 1961లో తూర్పు…. పశ్చిమ జర్మనీలను ..విడగోడుతూ బెర్లిన్ మధ్యలో గోడను నిర్మించారు. తూర్పు జర్మనీ కమ్యూనిస్ట్ ల పాలనలో ఉండగా.. పశ్చిమ జర్మనీ ప్రజలపాలనలో ఉన్నది. అయితే.. బెర్లింగ్ గోడ నిర్మాణం అనంతరం తూర్పు జర్మనీ నుంచి అనేక మంది.. పశ్చిమ జర్మనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన అనేక మందిని బధ్రతా దళాలు కాల్చి చంపాయి. అనేక వేలమందిని పట్టుకొని జైలులో పెట్టారు. దీంతో ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. గోడ నిర్మించిన 28సంవత్సరాల అనంతరం… అంటే 1989 నవంబర్ 9న ఈ గోడను కూల్చివేయడంతో ఐక్య జర్మనీ ఏర్పడింది. ప్రతి సంవత్సరం ఈ రోజును జర్మనీలో గొప్ప ఉత్సవంగా జరుపుకుంటారు. సెర్చ్ ఇంజన్ గూగల్ ఐక్యజర్మనీ పై డూడుల్ ను రూపొందించింది.