టీఆర్ఎస్ నేత కేకేకు గుడ్ న్యూస్.. ఆ పిటీషన్ కొట్టేసిన హైకోర్ట్..!

Thursday, February 13th, 2020, 10:47:44 PM IST

టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు గుడ్ న్యూస్ అందింది. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తుక్కుగూడ మున్సిపాలిటీలో రాజ్యసభ సభ్యుని హోదాలో (ఎక్స్ అఫీషియో) కేకే ఓటు వేశారు. వాస్తవానికి ఈ మున్సిపాలిటీలో మెజారిటీ ఉన్నప్పటికీ కేశవరావు ఓటు వేయడంతో ఆ ప్రభావం ఛైర్మన్ ఫలితంపై పడిందిని బీజేపీ నేత హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.

అయితే కేశవరావు ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు కాబట్టి తెలంగాణ ఎన్నికలతో ఆయనకు సంబంధం లేదని, ఆయన ఓటును రద్దు చేయండి అన్న వాదనతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేసిన బీజేపీ నేతను ట్రిబ్యునల్‌కు వెళ్ళాల్సిందిగా హైకోర్ట్ ఆదేశించింది. మరి దీనిపై ఆ బీజేపీ నేత ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తారా లేదా అనేది చూడాలి మరీ.