ఏపి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి గుడ్ న్యూస్…ఏప్రిల్ నెలకు కూడా..!

Friday, May 22nd, 2020, 09:18:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏప్రిల్ నెల మొత్తం లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ నెలకు గానూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి సంబంధించిన ఎలాంటి జీతాలు యాజమాన్యం చెల్లించలేదు. అయితే వారి ఉద్యోగాలు తొలగించినట్లు గా వార్తలు రావడం తో మంత్రి పేర్ని నాని స్పందించారు. ఎవరిని అలా తొలగించ లేదు అని అన్నారు. అయితే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఆర్టీసి ఎండీ ప్రతాప్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ చెప్పారు.వారికి ఏప్రిల్ నెల జీతాలు కూడా చెల్లించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.అయితే ఏప్రిల్ నెలకు 90 శాతం జీతాలను చెల్లించే అవకాశం ఉంది.

లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర పరిస్థితి మారడం తో ఏప్రిల్ నెలకు ఎటువంటి జీతాలు చెల్లించలేదు. అయితే లాక్ డౌన్ సడలింపు ల కారణంగా మళ్లీ బస్సులు రోడ్డెక్కాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.గత నెలలో అధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు రావొద్దు అని అన్నారు. అయితే ఇపుడు జీతాలు ఇస్తామని తెలపడం తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.