గ్రేటర్ హైదరాబాద్ కి మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి

Thursday, February 11th, 2021, 12:14:11 PM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈ సారి తెరాస, ఎం ఐ ఎం మరియు బీజేపీ పార్టీ లు తమ సత్తా చాటాయి. అయితే మేయర్ ఎన్నిక మాత్రం ఈ సారి కాస్త ఆలస్యం అయింది అని చెప్పాలి.తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి ఎన్నిక అవ్వడం తో అధికార పార్టీ లో సంబరాలు జరుపుతున్నారు. అయితే గద్వాల్ విజయలక్ష్మి తెరాస పార్టీ కి చెందిన కీలక నేత అయిన కే.కేశవరావు కుమార్తె. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ పుంజుకుంది అని చెప్పాలి. అయితే విజయలక్ష్మి ఎన్నిక పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, మరీ కొందరు మాత్రం ప్రశంసిస్తున్నారు.