నేరేడ్మెట్ కౌంటింగ్: నేను ఎవరికీ అమ్ముడుపోలేదు

Wednesday, December 9th, 2020, 01:31:30 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపద్యం లో నేరేడ్మెట్ ఫలితం నేడు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కౌంటింగ్ లో కొన్ని అవకతవకలు జరిగాయి అంటూ కొన్ని పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం వ్యవహారం పై ఆర్వో లీనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఏ అభ్యర్థికి, ఏ పార్టీ కి అనుకూలం గా వ్యవహరించలేదు అని అన్నారు. అయితే తన పై పలువురు అభ్యర్దులు ఆరోపణలు చేసిన విషయాన్ని వెల్లడించారు.

తన విధులకు ఆటంకం కల్పించడం పట్ల, అసభ్యంగా దూషించడం పట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే తనను దూషించిన కాల్ రికార్డులు తన వద్ద ఉన్నాయి అని తెలిపారు. ఈ విషయం పై ఎన్నికల సంఘానికి కూడా నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో తాను పారదర్శకంగా పని చేసినట్లు ,తను ఎవరికీ అమ్ముడుపొలేదు అని, అంతేకాక సెల్ ఫోన్, కాల్ రికార్డ్ అన్ని కూడా చూపించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.