అవినీతి జరిగితే సహించేది లేదు – మేయర్ విజయలక్ష్మి

Thursday, February 11th, 2021, 04:02:46 PM IST

గ్రేటర్ మేయర్‌గా టీఆర్ఎస్ పార్టీ కీలక నేత కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్‌కు ఎంఐఎం పార్టీ మద్దతు తెలపడంతో సునాయాసంగా టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్‌లను కైవసం చేసుకుంది. మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గద్వాల విజయలక్ష్మి ప్రజలకు అందుబాటులో ఉంటానని, హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

అంతేకాదు పేదలకు అన్యాయం జరగకూడదని, అవినీతి జరిగితే సహించబోనని అందుకోసం తాను ఎంత దూరమైనా వెళతానని అన్నారు. ఇదిలా ఉంటే బంజారాహిల్స్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచిన గద్వాల విజయలక్ష్మి ఎల్ఎల్‌బీ, జర్నలిజం చదువుకున్నారు. అమెరికాలో 18 ఏళ్ల పాటు ఉన్న విజయలక్ష్మి 2007లో అమెరికా పౌరసత్వం వదులుకుని భారత్‌కు తిరిగొచ్చేశారు.