ఈ నెల 11 న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక

Friday, February 5th, 2021, 08:35:01 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ కి ఇంకా ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఈ నెల 11 వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నూతన పాలక మండలి సమావేశం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. అయితే ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతీ ఏర్పాట్లను గురువారం నాడు పర్యవేక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో పాటుగా,ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు, కార్యదర్శులతో కలిసి పూర్తి స్థాయిలో సమావేశం అయ్యాక ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఎక్స్ అఫిషియో, పార్టీల వారీగా కార్పొరేటర్లకు సీట్ల కేటాయింపు, పూర్తి స్థాయి అంశాలను తెలుసుకున్నారు. అంతేకాక 11 న జరిగే సమావేశాన్ని పూర్తి స్థాయిలో వీడియో రూపం లో చిత్రీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క పార్టీ కి కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కలేదు అని అందరికీ తెలిసిందే.