బీ కేర్ పుల్: రోడ్డుపైకి నీరు వదిలినందుకు లక్ష ఫైన్..!

Wednesday, September 30th, 2020, 07:37:53 AM IST

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ బిల్డింగ్ యజమానికి షాక్ తగిలింది. తమ సెల్లార్‌లోకి చేరిన నీటిని మోటర్ సర్వీస్ ద్వారా రోడ్డుపైకి వదలడంతో లక్ష పైన్ పడింది. వాసవీ జీపీ ట్రెండ్స్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ తమ సెల్లార్‌లోకి చేరిన నీటిని సర్వీసు రోడ్డులోకి వదిలింది. ఇలా చాలా సార్లు నీరు రోడ్డుపైకి నీరు వదలడంతో ఇదివరకే ఓసారి జీహెచ్ఎంసీ అధికారులు వారికి వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఎన్ని సార్లు చెప్పినా వారు వినిపించుకోకుండా నీటిని రోడ్డుపైకే వదులుతుండడంతో ట్రాఫిక్ జామ్ అవ్వడం, బైకులు స్కిడ్ అయి పడిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే దీనిపై సీరియస్ అయిన జోనల్ కమీషనర్ రవికిరణ్ ఏకంగా ఆ బిల్డింగ్ యజమానికి లక్ష ఫైన్ విధించారు. అయితే హైదరాబాద్‌లోని చాలా మంది రోడ్లపై ఇలా నీరు వదులుతూనే ఉన్నారు. దీని వలన ట్రాఫిక్ జామ్, ప్రమాదాలు, రోడ్లు పాడవ్వడం వంటివి జరుగుతున్నాయి.